సమంత స్పందనకి షాకైన సురేష్ బాబు
By Newsmeter.Network Published on 11 Dec 2019 6:18 PM ISTతనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది సమంత. మజిలీ, ఓ.. బేబి చిత్రాలతో వరుస విజయాలు సాధించిన సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అయితే... సమంత ఏ సినిమా చూసిన దాని ఫలితం ఎలా ఉంటుందో కరెక్ట్ గా చెప్పేస్తుందట.
సమంత పై ఉన్న నమ్మకంతో సురేష్ బాబు వెంకీమామ సినిమాని సమంతకు చూపించారట. సినిమా కంప్లీట్ అయిన తర్వాత సమంత ఏం చెబుతుందో అని సురేష్ బాబు టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తే.. సమంత సినిమా చాలా బాగుంది అని చెప్పిందట. ఏ సీన్స్ అయినా తీసేయడం కానీ.. మార్పు చేయాల్సినవి కానీ.. ఉన్నాయా..? అని అడిగితే.. అలాంటిది ఏమీ లేదు. అంతా కరెక్ట్ గా ఉందని చెప్పిందట.
సురేష్ బాబు పదే పదే అడిగినా ఇదే సమాధానం చెప్పిందట. సమంత ఈ విధంగా స్పందించడంతో సురేష్ బాబు చాలా సంతోషంగా ఫీలయ్యారట. సమంతకే కాకుండా సినిమా ఇండస్ట్రీలో సన్నిహితులకు అలాగే ఇండస్ట్రీకి సంబంధం లేని కొంత మందికి వెంకీమామ సినిమాని చూపించారట. వాళ్లందరూ సినిమా చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో అప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారట వెంకీమామ టీమ్. రెండు రోజుల్లో వెంకీమామ థియేటర్స్ లోకి వస్తుంది. మరి.. బాక్సాఫీస్ వద్ద ఈ మామఅల్లుడు కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.