డ్యాన్స్ తో రచ్చ చేసిన నటి ప్రగతి

By సుభాష్  Published on  3 Oct 2020 4:46 PM IST
డ్యాన్స్ తో రచ్చ చేసిన నటి ప్రగతి

గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తారని.. బయట ప్రపంచంలో ఎలాంటి క్రేజ్ ఉండదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చేవి. అయితే ప్రగతి మాత్రం అందుకు భిన్నంగా క్రేజ్ అందుకుంటుందనే చెప్పాలి. జనాలను తన అందంతొనే కాకుండా.. ఎనర్జీకి వయసుకి సంబంధం లేదు అనే విధంగా అప్పుడప్పుడు ఫిట్నెస్ లుక్స్ తో షాకిస్తోంది.

ఎంతో కాలంగా ప్రగతి సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర ఏదైనా సరే సినిమాలో హైలెట్ అయ్యేలా నటిస్తుంది. దర్శకులు చెప్పిందే కాకుండా అప్పుడప్పుడు తన డిఫరెంట్ టైమింగ్ తో సినిమాలో అద్భుతమైన పర్ఫెమెన్స్ వచ్చేలా నటిస్తుందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది.

ప్రగతి తన డ్యాన్స్ వర్కౌట్ సెషన్లకు సంబంధించి ఇప్పటికే రెగ్యులర్ గా అనేక వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఏజ్ 40 కి చేరువైనా అసలు ఏమాత్రం ఉత్సాహం తగ్గడం లేదనడానికి ఈ వీడియోలే సాక్ష్యం. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ప్రగతి ఓ హిందీ సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ - హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటించిన 'సింబా' చిత్రం నుండి సూపర్ హిట్ సాంగ్ ‘ఆంఖే మారే’ కు ప్రగతి తన జిమ్ సెషన్ లో స్టెప్పులేసి దుమ్ము రేపారు. ఈ సాంగ్ కి పూర్తి మాస్ స్టెప్పులతో ప్రగతి అదరగొట్టేసారంతే. ఈజ్ ఉండాలే కానీ ఊపుదేముంది అయినా.. మనసుంటే మార్గం లేకపోలేదు మరి.

Next Story