పూజా హెగ్డే'కి ఆ విషయంలో మొహమాటం లేదంట!

By Newsmeter.Network  Published on  10 Dec 2019 1:29 PM GMT
పూజా హెగ్డేకి ఆ విషయంలో మొహమాటం లేదంట!

టాలీవుడ్ లోకి 'ఒక లైలా కోసం' అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ సినిమాతో నటన పరంగా పర్వాలేదనిపించినా పూజ కెరీర్ కు మాత్రం ఆ చిత్రం పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత 'ముకుంద'లో యాక్ట్ చేసినా అది ప్లాప్ అయింది. అయితే ఏం... ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. పైగా ప్రెజెంట్ టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డేనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.

పూజ ఖాతాలో వరుసగా 'అరవింద సమేత, మహర్షి' రీసెంట్ గా 'గద్దలకొండ గణేష్' లాంటి హిట్ సినిమాలున్నాయి. దీంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునే డైరెక్టర్స్ అంతా పూజా వైపే చూస్తున్నారు. దీంతో పూజా రెమ్యూనరేషన్ రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. సుమారు సినిమాకి రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అందుకే ఆమెకు ఈ మధ్య కాస్త ఆఫర్లు తగ్గాయి అని, అయినా పూజ మాత్రం డబ్బుల విషయంలో అసలు తగ్గట్లేదని.. ఏ మాత్రం మొహమాటం లేకుండా అంత ఇస్తేనే చేస్తానని డైరెక్ట్ గానే చెప్పేస్తుందట.

మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను ఈ టాల్ బ్యూటీ పక్కాగా ఫాలో అవుతోందన్నమాట. ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ 'జాన్', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో', అలాగే అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలున్నాయి. ఇవ్వన్నీ సూపర్ డూపర్ క్రేజ్ ఉన్న సినిమాలే. ఇవి గనుక హిట్టైతే రూ.2 కోట్లు కాస్త రూ.3 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఏమైనా పూజా హెగ్డే ఇలా రెమ్యూనరేషన్ గురించి వార్తలెక్కితే ఆమె కెరీర్ కి అది ప్లస్ కంటే కూడా మైనసే. మరి ఇక నుండైనా పూజా ఇలాంటి మ్యాటర్ లను చాల స్మూత్ గా హ్యాండిల్ చేస్తోందేమో చూడాలి.

Next Story