వెంకీకి షాక్ ఇచ్చిన అనుష్క‌..?

By అంజి  Published on  9 Dec 2019 4:18 AM GMT
వెంకీకి షాక్ ఇచ్చిన అనుష్క‌..?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం వెంకీ మామ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన వెంకీ మామ డిసెంబ‌ర్ 13న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత వెంకీ త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన అసుర‌న్ రీమేక్ లో న‌టించ‌నున్నారు.

ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్ లో స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో వెంక‌టేష్ భార్య‌గా న‌టించేందుకు అనుష్క‌ని సంప్ర‌దించార‌ట‌. అయితే... అనుష్క నో చెప్పింద‌ట‌. కార‌ణం ఏంటంటే... రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర‌లు చేయాలి అనుకోవ‌డం లేద‌ట‌.

ఏదైనా కొత్త‌ద‌నం ఉండాలి. ఆమె పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండాలి అని చూసుకుంటుంద‌ట‌. అనుష్క చాలా క‌థ‌లు విని నిశ్శ‌బ్ధం సినిమా చేసింది. ఇందులో క‌థ ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. అలాగే న‌ట‌న‌కు అవ‌కాశం ఉంది. అందుక‌నే నిశ్శ‌బ్ధం చిత్రానికి ఓకే చెప్పిందట‌. మ‌రి.. వెంకీ భార్య‌గా న‌టించే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో..?

Next Story
Share it