మళ్లీ రేటు పెంచేసిన హీరోయిన్‌

By సుభాష్  Published on  18 Jan 2020 4:11 PM IST
మళ్లీ రేటు పెంచేసిన హీరోయిన్‌

తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్నహీరోయిన్లలో ఒకరు కన్నడ ముద్దుగుమ్మ నభా నటేశ్‌. దర్శకుడు పూరి జగన్నాథ్‌, రామ్‌ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో రామ్‌ స్పీడ్‌కు ఎక్కడ తగ్గకుండా తెలంగాణ యాసలో మాట్లాడి తన అందాలతో అభిమానుల మతులుపోగొట్టింది. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో హీరోయిన్లకు ఇచ్చినంత రెమ్యూనరేషన్‌ ఏ ఇండస్ట్రీలో ఇవ్వరనేది టాక్‌. అందుకే తెలుగు సినిమాల్లో నటించాలంటే హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక కన్నడ సినిమాల్లో తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నభా నటేశ్‌.. తెలుగులో మాత్రం తన రెమ్యూనరేషన్‌ అమాంతంగా పెంచిసిందనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ భామకు 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో వచ్చిన పారితోషకం కేవలం రూ.20 లక్షలే. ఈ సినిమా హిట్‌ కావడంతో ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్‌ రేటు పెంచేసి ఏకంగా 40 లక్షలకు డిమాండ్‌ చేసిందట.. ఇక అదే రెమ్యూనరేషన్‌ డిస్కోరాజా కోసం అందుకుందట. ఆ తర్వాత మరో సినిమాను బెల్లంకొడ శ్రీనివాస్‌తో చేస్తోంది. ఈ సినిమాకు నభా నటేశ్‌ 80 లక్షల వరకు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ముద్దుగుమ్మ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారట నిర్మాతలు. పారితోషకాన్ని పెంచుకుంటు వస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరో సినిమా హిట్‌ అయితే ఇక కోటి రూపాయల వరకు వెళ్తుందనడంలో సందేహం లేదు.

Next Story