కరోనాను జయించిన మలైకా అరోరా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sep 2020 10:30 AM GMT
కరోనాను జయించిన మలైకా అరోరా

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా కరోనా మహమ్మారిని జయించింది. తాజాగా ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఇన్నిరోజులు నిర్బంధంలో ఉన్న అనుభూతి కలిగిందని.. ఇప్పుడు భయటకు వచ్చి సంతోషంగా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది. తనను కరోనా నుంచి బయటడేసిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపింది. పాజిటివ్ వచ్చాక కొద్ది నొప్పి, స్వల్ప ‘అన్-ఈజీ’ కి గురైనప్పటికీ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ తో కొలుకున్నానని పేర్కొంది.

కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఐసోలేషన్ లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంది. అలాగే తన హెల్త్ గురించి ఆందోళన చెంది, మెసేజులు పంపిన తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మలైకా అరోరా చెప్పింది. కరోనా రావడంతో తన కుమారుడిని, పెంపుడు కుక్కను దూరం పెట్టాల్సివచ్చిందని ఆవేదన చెందింది. తన కుమారుడిని, కుక్కను హగ్ చేసుకోలేకపోతునానని ఆ సందర్భంలో ఆమె పేర్కొంది. సెప్టెంబర్ 7న మలైకా అరోరాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లింది. డాక్లర్ల సలహాలు, సూచనలు జాగ్రత్తగా పాటించి కరోనా వైరస్‌ను జయించింది.

Next Story