హైదారాబాద్‌: సినిమా హీరో రాజశేఖర్‌ కారు బోల్తా పడింది. శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై వెళ్తున్న నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం జరిగింది. తుక్కుగుడా పెద్ద గోల్కండ మధ్యలో ప్రమాదవశాత్తు కారు టైరు పేలడంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. వెంటనే ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో రాజశేఖర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హీరో రాజశేఖర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిలో రాజశేఖర్‌ చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లారు. అయితే ఈ ప్రమాదంపై రాజశేఖర్‌ స్పందించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నానని.. తనకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. అప్పా జంక్షన్‌ వద్ద కారు ప్రమాదానికి గురైందన్నారు. కారులో ఒక్కడినే ఉన్నానని హీరో రాజశేఖర్‌ తెలి పారు.

Afb4ab4b 5500 4f71 Ab04 92d300a0c03f

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రాజశేఖర్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. పెద్ద గోల్కొండ టోల్‌గేట్‌ వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. TS 07FZ 1234 నెంబర్‌ గల బెంజ్‌ కారులో హీరో రాజశేఖర్‌ ఒక్కరే ఉన్నారని పోలీసులు తెలిపారు. హీరో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.