నటుడు నర్సింగ్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత
By సుభాష్ Published on 10 April 2020 8:35 AM ISTసినీ నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్.. గురువారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో హుటాహుటిన సోమాజిగూడలోని యశోధ ఆస్పత్రికి తరలించారు. అకస్మాత్తుగా కోమాలోకి వెళ్లిపోవడంతో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించినట్లు నర్సింగ్ యాదవ్ భార్య తెలిపారు. ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోంది. గత కొంత కాలంగా ఆయన డయలసిస్ చికిత్స తీసుకుంటున్నారు.
అయితే ఇంట్లో కిందపడిపోయిన ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. కాగా, మైలా నరసింహ యాదవ్‌ను సినీ ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుపుస్తుంటారు.
దాదాపు 300లకు చిత్రాల్లో నర్సింగ్ యాదవ్ కామెడీ విలన్‌గా, విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150లో కూడా నటించారు.