'యాక్షన్' మూవీ ఒక విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది - హీరో విశాల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 11:07 AM GMT
యాక్షన్ మూవీ ఒక విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది - హీరో విశాల్‌

'యాక్షన్' నా కెరీర్‌ లో 27వ సినిమా. 27 సినిమాల్లో ఎన్ని దెబ్బలు తగలాలో ఈ సినిమాలో అన్ని దెబ్బలు తగిలాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకూ ‘యాక్షన్‌’ తప్ప మరే టైటిల్‌ అనిపించలేదు. ఇది ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ థిల్లర్‌. సుందర్‌.సి గారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. మీరు సినిమా చూస్తున్నపుడు ఇది రూ.150 కోట్ల బడ్జెట్‌ మూవీలా కనిపిస్తుంది. కానీ రూ.60 కోట్ల బడ్జెట్‌. 88 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం అని హీరో విశాల్ తెలియ‌చేసారు.

ఈ సినిమా గురించి విశాల్ స్పందిస్తూ.... డైరెక్టర్‌ సుందర్‌.సి గారు ఎప్పుడూ నిర్మాతలు బాగుండాలని సినిమా తీస్తారు. చాలా మంది హీరోలు మూడు రాష్ట్రాల్లో గుర్తింపు రావాలని కోరుకుంటారు కానీ.. కొంత మందికే అది వస్తుంది. అలా మీ అభిమానంతోనే ఇంత వరకు రాగలిగాను. నాకు గుడి అంటే థియేటర్‌, దేవుళ్ళు మీరే. ఈ సినిమా నాకెరీర్‌లో ఒక మైల్‌ స్టోన్‌ మూవీ అవ్వాలని సుందర్‌ గారు తీశారు. దానికి తగ్గట్టుగానే ‘యాక్షన్‌’ మూవీ ఒక విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది. నేను లక్ష్మికళ థియేటర్‌లో నేల టికెట్‌ కొనుక్కొని సినిమా చూస్తాను. అది మీకు తెలీదు. అలా చూస్తున్నప్పుడు ఏ సీన్‌కి ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారో, ఏ సీన్‌ ఇంకా బాగాఉండాలని కోరుకుంటున్నారో నాకు తెలిసేది.

అలాగే ఈ సినిమాలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రానా ఒక ర్యాప్‌ చేశారు. త్వరలోనే మీరు వింటారు. ఈ సినిమా నవంబర్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. శ్రీనుకి ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నా తమ్ముళ్లు చాలా మంది ఉన్నారు తెలుగు సినిమాల్లో.. వారితో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. శ్రీను మంచి విజన్‌ ఉన్న ప్రొడ్యూసర్‌. సినిమా తీయాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు దానికి తగ్గ ఫ్యాషన్‌ ఉండాలి. అలా ఉంటేనే మనం ఖర్చుపెట్టే డబ్బు కరెక్ట్‌గా అందుతుందన్నారు.

Next Story