కర్నూలు: గూడూరు ఎమ్మార్వో హసీనాబీ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తన వ్యక్తిగత సహాయకుడు బాషా ద్వారా లంచం తీసుకున్న గూడూరు ఎమ్మార్వో హసీనాబీపై ఈ నెల 8న ఏసీబీ కేసు నమోదైంది. భూ వివాదం పరిష్కారానికి రూ.4 లక్షలు డిమాండ్‌ చేసింది. మరోవైపు ఎమ్మార్వో హసీనాబీ సూచనల మేరకు లంచం తీసుకున్న మహబూబ్‌బాషాకు కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఎమ్మార్వో హసీనాబీ ఇంకా పరారీలోనే ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story