మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ వివాదంలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి కోటి 12 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. వివాదంతో ఉన్న భూమి విషయంలో భారీగా లంచం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. లంచం డబ్బులు ఇవ్వడేమోననే అనుమానంతో లంచం ఇచ్చే వ్యక్తితో నగేష్ ఒప్పందం పత్రం కూడా రాయించుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది.