జేసీ పీఏ సురేష్ ఇంటిపై ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తులు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 12:11 PM ISTఅనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.3 కోట్ల రూపాయల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. పంచాయతీ రాజ్‌శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సురేష్ రెడ్డి పని చేస్తున్నారు. సురేష్ రెడ్డి చాలా కాలంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పని చేశారు. జేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా.. లేకపోయినా సురేష్ రెడ్డి మాత్రం తన సేవలను అందిస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏఈఈ సురేష్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేశారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
'ఇది కూడా చదవండి'.ఓ ‘చిన్న’ మాట.. ఈ మసీదు గొప్పేమిటో తెలుసా?