ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి : ఆయుష్ మంత్రిత్వశాఖ
By రాణి Published on 11 April 2020 10:12 PM ISTకరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు, హ్యాండ్ వాష్ లు, శానిటైజర్లు వాడటంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవాలని వైరస్ వ్యాపించడం మొదలైనప్పటి నుంచీ చెప్పుకుంటున్నాం. తాజాగా ఆయుష్ మంత్రిత్వ శాఖ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలి ? ఏం తినాలి ? అనే విషయాలపై పలు సూచనలు జారీ చేసింది.
- ప్రతిరోజూ సగటున అరగంట సేపు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయండి.
- కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేంత వరకూ ఎప్పుడు దాహంగా ఉన్నట్లు అనిపించినా గోరువెచ్చని నీరు తాగండి. లేదా కాచి చల్లార్చిన నీరు తాగండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
- భోజన సమయంలో తీసుకునే ఆహారంలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూడండి.
- తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్ష, బెల్లంలతో తయారు చేసిన ఆయుర్వేద టీ ని సేవించండి ఇలా రోజుకు రెండుసార్లు తాగండి. మీకు ఇష్టమైతే నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు.
- నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని వేడిచెసి రెండు మూడు చుక్కలు ముక్కు రంధ్రాల్లో ఉదయం, సాయంత్రం వేసుకోండి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గడంతో పాటు సూక్ష్మక్రిములుంటే చనిపోయే అవకాశం ఉంది.
- రోజులో ఒకట్రెండుసార్లు ఒక స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని మూడు నిమిషాల పాటు పుక్కిలించి ఊసివేయాలి. వెంటనే గోరువెచ్చటి నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి.
- 150 మిల్లీ లీటర్ల పాలలో అరస్పూన్ పసుపు కలుపుకుని రోజుకు ఒకట్రెండుసార్లు తాగండి.
- పొడిదగ్గు ఉన్నట్లు అనిపిస్తే పుదీనా ఆకులు లేదా సోంపు గింజలు కలిపిని నీటిని మరగబెట్టి ఆవిరి పట్టాలి. ఇలా రోజుకోసారి చేస్తే చాలు. అలాగే లవంగాలను పొడిచేసి బెల్లం లేదా తేనెతో కలిపి తింటి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అయినా దగ్గు తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించాల్సిందిగా ఆయుష్మాన్ మంత్రిత్వ శాఖ సూచించింది.
Next Story