‘ఆరోగ్య సేతు’ యాప్ ట్రాకింగ్‌ ఎలా పని చేస్తుందో తెలుసా..?

By సుభాష్  Published on  3 April 2020 10:12 AM GMT
‘ఆరోగ్య సేతు’ యాప్ ట్రాకింగ్‌ ఎలా పని చేస్తుందో తెలుసా..?

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 2301 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 56 మంది ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే తాజాగా నమోదైన కేసుల్లో కొందరికి ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి నడుం బిగించింది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఉండేందుకు, కరోనా సోకిన వారు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారో తెలుసుకునేందుకు ఓ యాప్‌ను రూపొందించింది. ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో మంత్రిత్వశాఖ 'ఆరోగ్య సేతు' అనే యాప్‌ను రూపకల్పన చేసినట్లు సర్కార్‌ వెల్లడించింది. యాప్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లేస్టోర్‌లో, ఐఫోన్‌ ఉపయోగించేవారు యాప్‌ స్టోర్‌లలో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆ తర్వాత పేరు, మొబైల్‌ నంబర్‌తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మన ఆరోగ్య విషయాలు, ఇతర ఆధారాలను నమోదు చేయాలి. అలాగే జీపీఎస్‌, బ్లూటూట్‌లను కూడా ఆన్‌ చేసుకోవాలి. ప్రస్తుత ఈ యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఆ యాప్‌ అత్యాధునిక టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా పని చేస్తుంది.

ఈ యాప్‌లో ఎలాంటి ప్రయోజనాలున్నాయి

ఈ యాప్‌లో అనేక ప్రయోజనాలున్నాయి. దేశంలో కరోనా కేసుల రిపోర్టు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తి దగ్గరకు మీరు వెళ్తే అప్రమత్తమైన హెచ్చరిస్తుంది. కాగా, తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులను మాత్రమే ఈ యాప్‌ పసిగడుతుందని చెబుతున్నారు. కరోనా లక్షణాలున్నా.. వాటిని నిర్ధారించేందుకు ప్రత్యేకమైన చాట్‌బోట్‌ ఉంటుంది.

Next Story