ఆరోగ్య సేతు సరికొత్త రికార్డ్

By రాణి  Published on  23 April 2020 7:36 PM IST
ఆరోగ్య సేతు సరికొత్త రికార్డ్

ముఖ్యాంశాలు

  • ఫేస్ బుక్ ను బీట్ చేసిన ఆరోగ్య సేతు
  • మోదీ పిలుపుతో 5 కోట్ల డౌన్ లోడ్స్

ఇతర దేశాలు రూపొందించిన ఏ యాప్ అయినా సరే మొదట దానిని ప్రయోగించేది భారత్ లోనే. ఎందుకంటే భారత్ లో ఆ యాప్ గుర్తింపు పొందిందంటే ఇక దానికి తిరుగుండదన్నమాట. ఈ రకంగానే ఫేస్ బుక్, వాట్సాప్ యాప్ లు మన దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా వెల్లడైన విషయం ఏమిటంటే..ఇండియాలో రూపొందించబడిన ఆరోగ్య సేతు ఆ రెండింటిని బీట్ చేసి 13 రోజుల్లో 5 కోట్ల యూజర్లను సొంతం చేసుకుంది.

Also Read : జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలి : పవన్ కల్యాణ్

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ కు 5 కోట్ల డౌన్ లోడ్స్ రావడానికి 19 రోజుల సమయం పట్టగా..ఆరోగ్య సేతు దానిని అధిగమించింది. 13 రోజుల్లో 5 కోట్ల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ డౌన్ లోడ్స్ చేసిన యాప్ గా ఆరోగ్య సేతు ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో వైరస్ లక్షణాలున్న వారిని, వైరస్ ఎక్కువగా ఉన్న జోన్లను గుర్తించేందుకు ఆరోగ్య సేతు యాప్ ను ప్రజలకు పరిచయం చేస్తున్నట్లు ఏప్రిల్ 14న ప్రధాని మోదీ తెలిపారు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నవారు తమ ఆరోగ్య వివరాలను అందులో నమోదు చేస్తే వారికి కరోనా ఉందో లేదో తెలియజేస్తుంది. అలాగే కరోనా లక్షణాలున్న వారికి మనం దగ్గరగా ఉన్నపుడు రెడ్ అలర్ట్ ఇస్తుంది. అలాగే ఈ యాప్ లో పలు ఆరోగ్య సూచనలు కూడా ఉన్నాయని, వాటిని అవలంబిస్తే కరోనా నుంచి రక్షణ పొందుతారని మోదీ చెప్పడంతో 5 కోట్ల మంది యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

Also Read :వెంకీమామ వంట..చిన్నోడు, కోబ్రా ఏం చేస్తారో ?

Next Story