జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలి : పవన్ కల్యాణ్

By రాణి  Published on  23 April 2020 11:58 AM GMT
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలి : పవన్ కల్యాణ్

కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలను లెక్కచేయకుండా కష్టపడుతున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Also Read : గోరంట్ల ప్రైమ్ టైమ్..సీఎం పై సెటైర్లు నెక్ట్స్ లెవల్

'' కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు చాలా ధైర్యంగా పనిచేస్తూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారమిస్తున్నారు. తెలంగాణలో కొన్ని చోట్ల జర్నలిస్టులు కూడా క్వారంటైన్ కు వెళ్లినట్లు తెలిసింది. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొంటూ విధులు చేపట్టాలి. పొరుగున ఉన్న తమిళనాడులో 25 మంది, ముంబైలో 50 మందికి పైగా జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, భీమాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. జర్నలిస్ట్ సంఘాలు, మీడియా సంస్థలు జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను.'' అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.



Next Story