గోరంట్ల ప్రైమ్ టైమ్..సీఎం పై సెటైర్లు నెక్ట్స్ లెవల్

By రాణి  Published on  23 April 2020 11:27 AM GMT
గోరంట్ల ప్రైమ్ టైమ్..సీఎం పై సెటైర్లు నెక్ట్స్ లెవల్

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విఫలమయిందన్న విమర్శలను ఎదుర్కొంటుంది. తమకు కనీస సదుపాయాలు ఇవ్వట్లేదని అడిగిన వైద్యుడు, అధికారిని సస్పెండ్ చేసి మరింత అబాసుపాలయింది. ఇది చాలదన్నట్లు దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై జరిగిన రగడ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ ట్విట్టర్ లో #9amPrimeTime అంటూ సెటైర్లు వేశారు. ఆ సెటైర్లు..ఆ కథేంటో తెలుసుకుందాం..

Also Read : బీజేపీ వర్సెస్‌ వైసీపీ.. ఏపీలో రాజకీయ రగడ

'' వయస్సు పెరుగుతున్నా కాలంతోపాటు పయనిస్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు అని చెప్పుకునే మన సీఎం గారేమో టైమ్ మెషీన్ ఎక్కి తనకి మాత్రమే సాధ్యమైన రివర్స్ జర్నీలో మూకీ సినిమా యుగానికెళ్లిపోయారు.

ప్రత్యక్ష ప్రసారానికొచ్చి ప్రతిసారీ అభాసుపాలై చివరిసారిగా మార్చి 26వ తేదీన 10 కేసులో ఉండటం చాలా సంతోషం అని వెలిబుచ్చిన మన సీఎం గారు మరల..ఏప్రిల్ 4న రికార్డ్ చేసిన ప్రెస్ మీట్ వదిలారు.

కరోనా కేసులు 800 దాటిపోయిన వేళ కొరియాలో కరోనా పుట్టిందని, బ్లీచింగ్ వేస్తే పోతుంది అనే ఆణిముత్యాలు మళ్లీ రాలకుండా ఆడియో లేని వీడియో ఒకటి ఏప్రిల్ 20న వదిలారు.

కబడ్డీ కబడ్డీ సినిమాలో మూకీ డ్రామా ప్రదర్శించినట్లున్నాయి ఆ రికార్డ్ చేసిన వీడియోలు.

అలవైకుంఠపురం సినిమా (2020) టైములో భీష్మ ప్రతిజ్ఞ (1921 తొలి తెలుగు మూకీ సినిమా) ప్రదర్శించడానికేన అంతా రావాలి జగన్..కావాలి జగన్ అన్నారు.

ఒక పక్క కేసుల సంఖ్య ఆయన నంబర్ దాటుకుని 800కి వెళ్తుంది. ఈయన మాత్రం శకుని మామ ఏ2ని పెట్టుకుని ప్రదర్శనలు చేస్తున్నారు..

అందరినీ పరుగులు పెట్టిస్తా అని చెప్పి ఈయన మాత్రం రివర్స్ లో వెనక్కి పరిగెడుతున్నాడు.''

అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ పై ఏకబిగిన సెటైర్లు వేశారు. గోరంట్ల చేసిన ఈ ట్వీట్ తో నెటిజన్లు పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నారు.

Also Read :15 ఏళ్లకే పెళ్లి..కేసీఆర్ మ్యారేజ్ ఫొటో వైరల్Next Story
Share it