15 ఏళ్లకే పెళ్లి..కేసీఆర్ మ్యారేజ్ ఫొటో వైరల్

By రాణి  Published on  23 April 2020 10:50 AM GMT
15 ఏళ్లకే పెళ్లి..కేసీఆర్ మ్యారేజ్ ఫొటో వైరల్

తెలంగాణ సీఎం కేసీఆర్ మ్యారేజ్ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు సంగతేంటంటే ఈరోజు కేసీఆర్ - శోభ పెళ్లిరోజట. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా మీలాంటి తల్లిదండ్రులుండటం మా అదృష్టం..హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెదనాన్న, పెద్దమ్మ అని ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆదర్శ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అని ట్వీట్లు చేస్తున్నారు.

Also Read : వెంకీమామ వంట..చిన్నోడు, కోబ్రా ఏం చేస్తారో ?

సంతోష్ కుమార్ షేర్ చేసిన కేసీఆర్ పెళ్లినాటి ఫొటోలో ఇద్దరూ చాలా చిన్నవయస్కులుగా కనిపిస్తున్నారు. నిజమే..1954 ఫిబ్రవరి 17న పుట్టిన కేసీఆర్ 1969 ఏప్రిల్ 23న శోభ ను పెళ్లాడారు. అంటే పెళ్లినాటికి కేసీఆర్ వయసు 15 ఏళ్లు మాత్రమే కదా..ఆ కాలంలో బాల్య వివాహాలు ఇలాగే ఉండేవి మరి. బాల్య వివాహమే అయినా భార్యను కష్టపెట్టకుండా చూసుకున్న ఘనత కేసీఆర్ ది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆదర్శవంతమైన దంపతులుగా మెలగుతూ విజయవంతంగా 42వ పెళ్లిరోజును జరుపుకుంటున్నకేసీఆర్ దంపతులకు మనం కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.Next Story