వెంకీమామ వంట..చిన్నోడు, కోబ్రా ఏం చేస్తారో ?

By రాణి  Published on  23 April 2020 8:54 AM GMT
వెంకీమామ వంట..చిన్నోడు, కోబ్రా ఏం చేస్తారో ?

టాలీవుడ్ లో ప్రస్తుతం #BetheREALMAN ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. ఒక్కొక్కరు తమ ఛాలెంజ్ ను కంప్లీట్ చేసి మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నారు. జక్కన్న నుంచి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లను నామినేట్ చేశాడు. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ ఇంటి పని చేసి అమ్మకు ప్రేమతో..దోసెలేసిపెట్టారు.

Also Read : రష్మిక మందన్న క్వారంటైన్ ఫొటోలు

తాజాగా వెంకీమామ ఇల్లు తుడిచి, గార్డెనింగ్ చేసి, వంట చేసేశారు. రండి మనం ఇంట్లోవారికి సహాయం చేద్దాం..ఇంట్లో ఎప్పుడూ పనిచేసే ఆడవాళ్లకి కాస్త విశ్రాంతినిద్దాం అని పేర్కొంటూ వెంకీ చేసిన ఇంటి పనుల వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు.

Also Read : ‘చిరు’ దోశ‌లు.. మంత్రి కేటీఆర్ నామినేట్

నా పని పూర్తయింది ఇప్పుడిక మా చిన్నోడు @UrsTrulyMahesh, కోబ్రా @IAmVarunTej, దర్శకుడు అనిల్ రావిపూడి ల వంతు అని ఈ ముగ్గురినీ నామినేట్ చేశారు. కాగా..తారక్ నామినేట్ చేసిన చిరంజీవి, వెంకటేశ్ ఛాలెంజ్ పూర్తి చేశారు. ఇంకా నాగార్జున మాత్రం ఈ ఛాలెంజ్ పై స్పందించలేదు.Next Story