ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక మందన్న ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో రష్మిక అల్లుఅర్జున్ సరసన కనిపించనుంది. లాక్ డౌన్ తో షూటింగ్ లు ఆగిపోగా ఇంట్లోనే గడుపుతోందీ భామ. క్వారంటైన్ తాను చేసే పనులను గురించి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటోంది.