ఆధార్ సరికొత్త మైలురాయిని సాధించిందని భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (ఉడాయ్ ) తెలిపింది. 12 అంకెలతో జారీ చేసిన ఆధార్ కార్డు లు ఇప్పటి వరకు దేశంలో 125 కోట్ల మంది భారతీయుల దగ్గర ఉన్నాయని .. దీనివలన 125 కోట్ల మార్కును అధిగమించిందని… దేశ జనాభా ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు గా వినియెగిస్తున్నారని ఉడాయ్ తన ట్విటర్ ద్వారా తెలిపింది.

దేశం జనాభాలో 93 శాతం మంది దగ్గర ఆధార్ కార్డు లు ఉన్నాయని భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజూ 3 కోట్ల ఆధార్ అదేంటికేషన్ అభ్యర్థనలు తీసుకొంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ ను అప్ డేట్ చేసుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుందని ఉడాయ్ తెలిపింది. ఆధార్ ను అన్ని పథకాలకు అనుసంధానం చేయటం వలన ప్రతిఒక్కరు కూడా ఆధార్ ను తీసుకుంటున్నారు అని తెలిపారు. అదేవిధంగా ప్రపంచంలో అతి పెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా ఆధార్ ఉందన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.