ఉత్తరాఖండ్ :హెల్మెట్ లేదనో, కారులో సీటు బెల్ట్ వేసుకోలేదనో ట్రాఫిక్ పోలీసులు జరిమాణా విధించడం మామూలే కానీ, ఎడ్ల బండి కి చలానా వేయడం ఎప్పుడూ వినలేదు కదూ, అదే చేసారు మన ఉత్తరాఖండ్ పోలీసులు. దెహ్రాదూన్ శివారులో సహాన్ పూర్ లో రియాన్ హసన్ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రం దగ్గర ఎడ్ల బండి నిలిపి ఉంచాడు. అంతే..పోలీసులు వెయ్యి రూపాయల చలానా వేశారు.

మోటారు వాహనాల పరిధిలోకి ఎడ్ల బండి ఎలా వస్తుందని హసన్ నిలదీయడంతో చివరకు చలానా రద్దు చేసారు. ఐపీసీ చట్టం కింద ఇసుక దొంగ రవాణా చేస్తున్నందుకు కేసు బుక్ చేయాలనుకున్నామనీ, అయితే తప్పు బిల్ బుక్కు లో రాయడంతో తప్పుడు చలానా వచ్చిందని పోలీసులు తమ చర్య ను సమర్ధించుకున్నారు. ఏది ఏమైనా కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారనే అనిపిస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.