స్వామిజీ కన్నుమూత.. మోదీ సంతాపం.. అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతోనే..

By సుభాష్  Published on  29 Dec 2019 5:55 AM GMT
స్వామిజీ కన్నుమూత.. మోదీ సంతాపం.. అంత్యక్రియలు కూడా ప్రభుత్వ  లాంఛనాలతోనే..

పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి అనారోగ్యంతో కన్నుముశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. అనారోగ్యానికి గురైన స్వామిజీని ఆదివారం ఉదయం మణిపాల్‌ కేఎంసీ ఆస్పత్రి నుంచి ఉడుపి మఠానికి తరలించారు. మఠంలోనే స్వామి తుదిశ్వాస విడిచారు. కాగా, అనారోగ్యం కారణంగా ఈనెల 20న చికిత్సనిమిత్తం ఆస్పత్రిలోచేర్పించారు. ఆయన అనారోగ్యం పూర్తిగా క్షిణించిందని, వైద్యులు చెప్పడంతో మఠానికి తరలించారు.

స్వామి మరణించారని సమాచారం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ రోజు పర్యటనలు రద్దు చేసుకుని ఊడుపి చేరుకున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామి మరణ వార్త విని భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.

విశ్వేశ తీర్ధ స్వామీజీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్టు ఉడిపి ఎమ్మెల్యే కె.రఘపత్ భట్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ రోజు కార్యక్రమాలను రద్ద చేసుకుని ఉడుపి చేరుకున్నారు. స్వామి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

88 Year Old Pejawar Seer

కాగా, స్వామీజీ ఇకలేరని తెలియగానే భక్తులు పెద్దఎత్తున ఉడిపి శ్రీకృష్ణ మఠానికి చేరుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా అక్కడకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో స్వామీజికి అంత్యక్రియలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్వామీజీ ఇకలేరని తెలియడం తనను విచారంలో ముంచెత్తిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీ ఆత్మకు ఆ కృష్ణ భగవానుడు శాంతి కలిగించాలని, భక్తులకు మనోస్థైర్యం ప్రసాదించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.

ప్రధాని సంతాప సందేశం

ఉడిపి పెషావర మఠాధిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ మహాభినిష్క్రమణపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. తన సంతాపం తెలియజేశారు. సేవకు మారుపేరు విశ్వేత తీర్ధ స్వామీజీ అని, ఆయన అందించిన ఆధ్యాత్మిక, ప్రజాసేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వామీజీ ఆత్మక శాంతి కలగాలని, ఆయన అశేష భక్తులు నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ సంతాప సందేశంలో మోదీ పేర్కొన్నారు.

Next Story