ఏపీలో కరోనా విజృంభన.. కొత్తగా 82కేసులు
By తోట వంశీ కుమార్ Published on 28 April 2020 12:26 PM ISTకరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి ఇప్పటి వరకు 31 మంది మృత్యువాత పడ్డారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కర్నూలులో 40 నమోదు కాగా.. గుంటూరులో 17, కృష్ణాలో 13, కడపలో 7, నెల్లూరులో 3, అనంతపురంలో 1, చిత్తూరులో 1 చొప్పున కేసులు నమోదైయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 కేసులు, గుంటూరు 254,కృష్ణా జిల్లాలో 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.
కాగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 258 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 970 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.