ఐదేళ్ల బాలుడు.. అపార్ట్‌మెంట్ సెల్లార్ లో ఆడుకుంటుండగా..
By Newsmeter.Network Published on 24 Jan 2020 4:58 PM IST
మల్కాజ్‌గిరి లో విషాదం చోటుచేసుకుంది. కార్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటన వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా, మగనూర్ మండలానికి చెందిన రంగప్ప మల్కాజిగిరిలోని వెంకట్ ప్లాజాలో నివాసముంటున్నాడు. ఆయనకు తరుణ్(5) అనే కొడుకు ఉన్నాడు. శుక్రవారం ఉదయం అపార్ట్ మెంట్ సెల్లార్ లో బాలుడు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అపార్ట్‌మెంట్ కు చెందిన ఓ వ్యక్తిని కారును రివర్స్ చేస్తుండగా.. బాలుడిని గుర్తించకుండా వెనక్కి తీయడంతో కారు వెనుక చక్రాలు తరుణ్ పై నుంచి వెళ్లిపోయాయి.
బాలుడి కేకలు విన్న కుటుంబసభ్యులు బయటకు వచ్చి చూసేసరికే తరుణ్ విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.