ఏపీలో మరో 52 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 18 May 2020 12:02 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,713 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 52 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2282 కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 50మంది మృతి చెందారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 1527 మంది డిశ్చార్జి కాగా.. 705 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో చిత్తూరులో 15, తూర్పుగోదావరిలో 5, కడపలో 2, కృష్ణాలో 15, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కర్నూలులో అత్యధికంగా 615 కేసులు నమోదు కాగా.. గుంటూరులో 417, కృష్ణాలో 382, చిత్తూరులో 192, అనంతపురంలో 122, నెల్లూరులో 157 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.