40 మంది బౌన్సర్ల మధ్య తాళి కట్టిన పెళ్లి కొడుకు
By సుభాష్ Published on 28 Feb 2020 3:32 PM ISTపెళ్లి ఒకే సారి జరుగుతుంది.. మళ్లీ మళ్లీ చేసుకోలేమంటూ కొందరు పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కొందరు గుర్రపు బగ్గీలపై వధువరులను ఊరేగిస్తుంటే..మరి కొందరు పూల పల్లకీలో తోడుకుని వస్తుంటారు. అలాగే ఈ కాలంలో ప్రీ వెడ్డింగ్ షోలు కూడా తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ జరిగిన పెళ్లి మాత్రం పూర్తిగా వెరైటీ అనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఓ వివాహం అశ్చర్యం కలిగించిది. పెళ్లి వేడుకలో వరుడు చేసిన హంగామాను చూసి పెళ్లికి వచ్చిన వారంతా షాకయ్యారు. జిల్లాలోని టేకులపల్లి మంలడం సింగ్యతాండకు చెందిన బానోత్ పుల్సింగ్ కుమారుడు రవితే, ములుగు జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాగా, పెళ్లి మండపంలో 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని తాళి కట్టాడు వరుడు. వారంతా సఫారీలు ధరించి నల్ల కళ్లుజోడు ధరించి ఉన్నారు. ఈ తంతును చూసినవారంతా ముక్కున వేలేసుకున్నారు.
ఇక వరుడు ఎక్కడికెళ్లినా నలుగురు బౌన్సర్లు, మిగిలిన వారంతా మండపం అంతటా కనిపించారు. ఇక వివాహానికి వచ్చిన వారంతా ఏం జరుగుతుందో తెలియక వింతగా చూస్తూ ఉండిపోయారు. ఓ సాధారణమైన వ్యక్తి 40 మంది బౌన్సర్లను నియమించుకోవడం ఆశ్యర్యపోయారు. సెలబ్రిటీలకు ఇంత భద్రత ఉండదేమో అంటూ గుసగుసలాడుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పెళ్లి కోసం పూలను రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాడట. ఇలా ఓ సామాన్యుడి పెళ్లి జరగడం చర్చనీయాంశంగా మారింది.