తెలంగాణ: బోరుబావిలో మూడేళ్ల బాలుడు.. సహాయక చర్యలు ముమ్మరం
By సుభాష్ Published on 27 May 2020 7:23 PM ISTమెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి అధికారులు చేరుకుని ఆక్సిజన్‌ను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే 120 నుంచి 150 అడుగు లోతులో ఉన్న బావిలో బాలుడు 20 అడుగల లోతులో ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్పీ చందనా దీప్తి సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు. కాగా, దాదాపు 150 అడుగుల వరకూ బోరు వేసినప్పటికీ నీళ్లు పడకపోవడంతో బావిని అలాగే వదిలేట్లు యజమాని చెబుతున్నాడు.
అయితే బోరుబావి తవ్విన కొద్దిసేపటికి బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి రెండు అంబులెన్స్‌ను కూడా చేరుకున్నాయి. అలాగే ఘటన స్థలంలో రెండు జేసీబీలతో సహాచక చర్యలు చేపడుతున్నారు. బాలుడు బోరుబావిలో పడిపోవడంతో కుటుంబ సభ్యులకు కన్నీరు మున్నీరవుతున్నారు.
[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-27-at-7.52.55-PM.mp4"][/video]