తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే 209 కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 11 Jun 2020 9:59 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. తాజాగా కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాత్రి 8గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 209 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్క రోజు 9మంది మృతి చెందారు. ఈ ఒక్క రోజే జీహెచ్‌ఎంసీ పరిధిలో 175 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసులు 4320కి చేరుకోగా, వీరిలో 449 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులున్నారు.

Next Story