ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. మరీ ఆటలు జరిగేనా..?

By అంజి  Published on  21 March 2020 9:50 AM GMT
ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. మరీ ఆటలు జరిగేనా..?

టోక్యో: జపాన్‌లో ఒలింపిక్స్‌ సంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒలింపిక్‌ జ్యోతిని గ్రీస్‌.. టోక్యో గేమ్స్‌ నిర్వాహకులకు అప్పగించింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించారు. ఎంతో అట్టహాసంగా జరగాల్సిన ఈ సంప్రదాయ కార్యక్రమంలో కోవిడ్‌-19 కారణంగా ప్రేక్షకులు పెద్దగా పాల్గొనలేదు. ఒక ప్రత్యేక లాంతరులో జ్యోతిని విమానంలో తీసుకొచ్చారు. గ్రీస్‌ ఒలింపిక్‌ కమిటీ చీఫ్‌ స్పైరోస్‌ కాప్రలోస్‌ చేతుల మీదుగా టోక్యో గేమ్స్‌ ప్రతినిధి నవోకో ఇమోటో జ్యోతిని అందుకున్నారు. ఈ నెల 26 నుంచి ఒలింపిక్‌ జ్యోతి రీలే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మొదటగా 200 మంది చిన్నారులను తీసుకురావాలని జపాన్‌ అధికారులు భావించారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఆ ఆలోచన మానుకున్నారు.

Also Read: క్రికెటర్‌కు కరోనా

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో ఆటలన్నీ వాయిదాపడ్డాయి. అయితే జూలైలో ప్రారంభం కాబోయే ఒలింపిక్స్‌పై కూడా జరుగుతాయో లేదో అన్న అనుమాత్రం ఉంది. ఒలింపిక్‌ గేమ్స్‌ను వాయిదా వేయాలని ఇప్పటికే పలువురు అంటున్నారు. జపాన్‌ ఒలింపిక్‌ కమిటీ కార్యనిర్వాహాక సభ్యుడు యమగూచి కూడా గేమ్స్‌ను వాయిదా వేయాలని చెప్పాడు. గేమ్స్‌ వాయిదా వేయాలన్న డిమాండ్‌ రోజు రోజుకు పెరుగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు గేమ్స్‌ను నిర్వహించనున్నారు. కరోనా ఉన్న ఒక వేళ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఒలింపిక్స్‌ను ఖచ్చితంగా నిర్వహిస్తామని ఇంటర్నేషన్‌ ఒలింపిక్స్‌ కమిటీ అధ్యక్షుడు అన్నారు.

టోక్య 2020 ఒలింపిక్స్‌ టార్చ్‌ను ప్రత్యేకంగా సంప్రదాయ, ఆధునిక సాంకేతిక జోడిస్తూ రూపొందించారు. ఈ టార్చ్‌ జపానీయులకు ఎంతో ఇష్టమైన చెర్రీ బ్లాసమ్‌ పువ్వును తలపిస్తోంది. చెర్రీ బ్లాసమ్‌ పువ్వులో ఐదు రేకులకు చిహ్నంగా ఐదు జ్వాలలు వచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ ఐదు జ్వాలలు ఏకమై ప్రకాశవంతంగా మండుతాయి.

Next Story