క్రికెటర్‌కు కరోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2020 8:05 AM GMT
క్రికెటర్‌కు కరోనా

కరోనా వైరస్(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వల్ల పదివేల మందికి పైగా మృత్యువాత పడగా.. రెండు లక్షల మంది దీని బాధితులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ క్రికెటర్‌కు కరోనా సోకింది. పాక్‌ సంతతికి చెందిన స్కాట్లాండ్‌ క్రికెటర్, ఆఫ్‌ స్పిన్నర్‌ మాజిద్‌ హక్‌.. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం తాను స్కాట్లాండ్‌ రాజధాని గ్లాస్గోలోని రాయల్‌ అలెగ్జాండ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని... త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకు మెసేజ్‌ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

2006 నుంచి 2015 వరకు అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగిన హాక్ స్కాట్లాండ్ తరుపున 54వన్డేలు, 24టీ20లు ఆడాడు. వన్డేల్లో 60 వికెట్లు.. టి20ల్లో 28 వికెట్లు తీశాడు. 2015 ప్రపంచకప్‌లో చివరిసారి ఆడాడు. వన్డేల్లో స్కాట్లాండ్‌ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగగా.. 2019లో ఫాస్ట్ బౌలర్‌ సయాన్ షరిప్ అతడిని అధిగమించాడె. ప్రస్తుతం మాజిద్ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.



Next Story