దిశ రేపిస్టుల ఎన్‌కౌంటర్‌ చిత్రం గా సోషల్ మీడియాలో తిరుగుతున్న 2015 నాటి చిత్రం

By సత్య ప్రియ బి.ఎన్  Published on  6 Dec 2019 10:37 AM GMT
దిశ రేపిస్టుల ఎన్‌కౌంటర్‌ చిత్రం గా సోషల్ మీడియాలో తిరుగుతున్న 2015 నాటి చిత్రం

డిసెంబర్ 6, 2019 తెల్లవారుజామున, దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.

ఈ సంఘటన తరువాత సోషల్ మీడియా లో ఎన్నో చిత్రాలు షేర్ చేయబడుతున్నాయి. వాటిలో ఒక చిత్రంలో నిందితుల మృతదేహాల దగ్గర పోలీసులు నిలబడి కనబడతారు.

ఈ చిత్రం ట్విట్టర్ లో హైదరాబాద్ ఎంకౌంటర్ కు సంబంధించింది అంటూ విరివిగా షేర్ చేయబడింది.

నిజ నిర్ధారణ:

రివర్స్ ఇమేజ్ సేర్చ్ చేసి చూడగా, ఆ చిత్రం 2015 సంవత్సరంలోనిదిగా తెలుస్తోంది. ఏప్రిల్ 7, 2015 లో, తిరుమల దగ్గరలోని శేషాచలం అడవులలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ వారు తమిళనాడు కి చెందిన 20 మంది ఎర్ర చందబం స్మగ్లర్లను ఎంకౌంటర్ చేసినప్పటి చిత్రం ఇది.

ఈ ఘటన జరిగినప్పటి రిపోర్ట్ లు:

https://www.thehindu.com/news/national/andhra-pradesh/20-red-sanders-smugglers-shot-dead-in-chittoor-encounter/article7076614.ece

http://www.coastaldigest.com/news/74353-police-encounter-20-suspected-sandalwood-smugglers-shot-dead

హైదరబాద్ లో జరిగిన ఎంకౌంటర్ తాలూకు చిత్రాలు చాలా విడుదల అయినా, నిందితుల మృత దేహాల చిత్రాలు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. కేవలం ఘటనా స్థలం, ఎంకౌంటర్ నిర్వహించిన పోలిసులు, అక్కడికి చేరుకున్న జనం చిత్రాలు మాత్రమే మీడియా లో తిరుగుతున్నాయి.

అయితే, నిందితుల మృతదేహాల దగ్గర పోలీసులు నిలబడి ఉన్న చిత్రం మాత్రం హైదరాబాద్ ఎంకౌంటర్ కి సంబంధించింది కాదు, 2015 లో తిరుమల దగ్గరలో జరిగిన ఎంకౌంటర్ కి సంబంధించింది.

Claim Review:దిశ రేపిస్టుల ఎన్‌కౌంటర్‌ చిత్రం గా సోషల్ మీడియాలో తిరుగుతున్న 2015 నాటి చిత్రం
Claim Fact Check:false
Next Story
Share it