తెలంగాణ‌లో కొత్త‌గా 1,983 కేసులు.. 10 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Oct 2020 4:15 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1,983 కేసులు.. 10 మ‌ర‌ణాలు

తెలంగాణలో కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,983 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 10 మంది మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో ..

పాజిటివ్‌ కేసుల సంఖ్య – 1,983

మరణాల సంఖ్య – 10

కోలుకున్నవారు – 2,381

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య -2,02,594

మొత్తంమరణాల సంఖ్య – 1181

మొత్తం యాక్టివ్‌ కేసులు – 26,644

ఐసోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య – 21,784

రాష్ట్రంలో కోలుకున్నవారు – 1,74,769

రాష్ట్రంలో మరణాల రేటు – 0.58 శాతం

దేశంలో మరణాల రేటు – 1.6 శాతం

రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు – 86.26 శాతం

దేశంలో కోలుకున్నవారి రేటు – 84.7 శాతం

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసుల జిల్లాలు

జీహెచ్‌ఎంసీ – 292

క‌రీంన‌గ‌ర్ -109

ఖ‌మ్మం - 117

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి - 147

న‌ల్గొండ - 105

రంగారెడ్డి – 187

నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story