తెలంగాణ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 3:26 AM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,637 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి రాష్ట్రంలో 2,44,143 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1357కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 1,273 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,24,686కు చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 18,100 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 15,335 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఒక్క రోజు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 292 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ త‌ర్వాత ల‌త్య‌ధికంగా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 118, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 129, న‌ల్ల‌గొండ‌లో 101, రంగారెడ్డి జిల్లాలో 136 కేసులు న‌మోద‌య్యాయి. మిగ‌తా జిల్లాల్లో ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి.

Next Story