15 అడుగుల కింగ్ కోబ్రాను పట్టేశారు..!

By సుభాష్  Published on  12 July 2020 6:54 AM GMT
15 అడుగుల కింగ్ కోబ్రాను పట్టేశారు..!

కోయంబత్తూర్: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు దగ్గరగా ఉన్న గ్రామంలో 15 అడుగుల నల్ల త్రాచు పాము కనిపించింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే నరసిపురం గ్రామానికి చేరుకుని ఆ పామును పట్టేసుకున్నారు. పశ్చిమ కనుమల్లోని వెళ్లింగిరి పర్వాతానికి సమీపంలో ఈ గ్రామం ఉండడంతో పాముల సంచారం ఎక్కువగా ఉంది. విషపూరితమైన పొడవైన పామైన నల్ల త్రాచుకు పశ్చిమ కనుమలు ఎన్నో ఏళ్లుగా ఆవాసంగా ఉంది. ఈ 15 అడుగుల పామును సిరువాని అటవీ ప్రాంతంలోకి అధికారులు వదిలేసి వచ్చారు. గతంలో కూడా ఈ కింగ్ కోబ్రాలు జనావాసాల్లోకి రావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

అత్యంత విషయమైన పాముల జాతుల్లో ఒకటైన రక్త పింజరి కూడా కోయంబత్తూరుకు దగ్గరలో ఉన్న గ్రామంలోకి ఇటీవలే వచ్చింది. బాత్ రూమ్ లో రక్తపింజరి పాము ఉండడాన్ని గమనించిన ఇంటి యజమాని పాములు పట్టే వాళ్లకు సమాచారం అందించారు. కొన్ని నిమిషాల తర్వాత తెలిసిందేమిటంటే ఆ పాము పిల్లలకు జన్మనిస్తోందని..! గొనె సంచిలో మురళి అనే పాములు పట్టే వ్యక్తి గోనె సంచిలో పామును తీసుకుని అడవిలో వదిలిపెట్టాలని భావించాడు.. ఆ పాము గర్భంతో ఉందని భావించి.. ఓ చెట్టు కింద పెట్టగా రెండు గంటల తర్వాత దాదాపు 35 పిల్లలకు ఆ పాము జన్మనిచ్చింది. వాటిని స్థానిక అడవిలోకి వదిలిపెట్టేశారు.

Next Story
Share it