బ్రేకింగ్: భారీ అగ్నిప్రమాదం.. 15 మంది చిన్నారులు మృతి

By సుభాష్  Published on  15 Feb 2020 3:54 AM GMT
బ్రేకింగ్: భారీ అగ్నిప్రమాదం.. 15 మంది చిన్నారులు మృతి

మెక్సికోలో ఘోరం జరిగిపోయింది. హైతీ రాజధాని పోర్ట్‌ -ఔ- ప్రిన్స్‌ నగరంలో ఉన్న ఓ అనాధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు మృతి చెందారు. పోర్ట్‌-ఔ- ప్రిన్స్‌ నగర శివారులో కెన్‌స్కాఫ్‌ ప్రాంతంలో చర్చి ప్రాంతంలో చర్చి ఆఫ్‌ బైబిల్‌ ఆధ్వర్యంలో ఈ అనాధాశ్రమం కొనసాగుతోంది. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

కాగా, అగ్నిమాపక శకటాలు వచ్చే సరికి సుమారు గంటన్నర సమయం పట్టిందని, మృతుల సంఖ్య కూడా బాగా పెరిగిందని అనాధాశ్రమంలోని బాలల సంరక్షకురాలు రోస్‌ మారీ లూయిస్‌ తెలిపారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఆరేళ్ల లోపే ఉన్నారని, మిగతా వారు 10 నుంచి 12 ఏళ్ల వారున్నారని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిని చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని హైతీ అధ్యక్షుడు జోవెనెల్‌ మోయిస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై నివేదిక అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

15 Children Were Killed

Next Story