139 మంది అత్యాచారం కేసు: డాలర్‌ బాయ్‌ అరెస్ట్‌

By సుభాష్  Published on  23 Oct 2020 11:59 AM GMT
139 మంది అత్యాచారం కేసు: డాలర్‌ బాయ్‌ అరెస్ట్‌

తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించిన యువతి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు కోపసం సీసీఎస్‌కు బదిలీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులు ప్రధాన నిందితుడుగా ఉన్న రాజశ్రీకర్‌రెడ్డి అలియాస్‌ డాలర్‌ బాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న డాలర్‌ బాయ్‌ను సీసీఎస్‌ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టకు తరలించారు.

కాగా, డాలర్‌ బాయ్‌ ఒక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తాజాగా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిపై 376, 184, 185, 509, 69 ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. యువతి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. దీనిలో భాగంగా మరికొన్ని వివరాల కోసం అతన్ని రిమాండ్‌లోకి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, యువతి చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Next Story
Share it