బ్రేకింగ్: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
By సుభాష్ Published on 23 Oct 2020 5:09 PM IST
తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విరుదునగర్ జిల్లా ఎరిచ్చనత్తంలో ఓ బాణ సంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి చెందారు. అలాగే మరో 10 మంది వరకు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story