తెలంగాణ‌లో వెయ్యి దాటిన క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2020 3:54 PM GMT
తెలంగాణ‌లో వెయ్యి దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు వెయ్యిని దాటాయి. ఇక రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌గా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఆదివారం కొత్త‌గా 11 కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. వీటితో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 1001 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 25 మంది మృత్యువాత ప‌డ్డారు. మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 316 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్ర‌స్తుతం 660 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు న‌మోదైన 11 కేసులు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోనే న‌మోదు అయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 9 మంది డిశ్చార్జి అయ్యారు.

హైదరాబాద్‌ పరిధిలోనే ఇప్పటి వరకు 540 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. సూర్యాపేట జిల్లాలో 83, నిజామాబాద్ లో 61, వికారాబాద్ 37, గ‌ద్వాల్‌లో 45, రంగారెడ్డిలో 33 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

Next Story