అక్కడ కరోనాతో 11 మంది భారతీయులు మృతి

By రాణి  Published on  9 April 2020 5:01 PM GMT
అక్కడ కరోనాతో 11 మంది భారతీయులు మృతి

కరోనా రక్కసి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టింది. సుమారు 90 వేల మంది ప్రాణాలను బలితీసుకుంది. చైనా తయారు చేసిన వస్తువులకు గ్యారెంటీ ఉండదంటారు కానీ..చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ మాత్రం చాలా గట్టిగానే ఉంది. ఒక్కసారి నన్ను పట్టుకుంటే వదిలించుకోవడం చాలా కష్టమని డైరెక్ట్ గానే చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా 15,02,618 మంది కరోనా వైరస్ బారిన పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని దేశాల్లో కన్నా అమెరికాలోనే వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. మొన్నటి వరకూ ఇటలీలో మృత్యు మృదంగం మోగించిన కరోనా..ఇప్పుడు అమెరికాపై విరుచుకు పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన లెక్కల ప్రకారం 4,34,861మందికి కరోనా వైరస్ సోకగా..14,814 మంది మరణించారు. మరో 24,146 మంది కోలుకున్నారు.

Also Read : ఏప్రిల్ 22 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి ఈటెల

లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ విమాన సర్వీసులు నిలిపివేయడంతో చాలా మంది భారతీయులు అమెరికాలోనే ఉండిపోయారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు ఇలా ఇండియాకు రావాలనుకున్నవారంతా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అమెరికాలో లాక్ అయ్యారు. అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ 2 వేల మంది కరోనా రక్కసి ఒడిలోకి చేరారు. మొత్తం 14,814 మంది మృతుల్లో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. మృతుల్లో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలకు చెందినవారు కాగా ఒకరు ఫ్లోరిడాకు చెందిన వారుగా గుర్తించారు. 11 మంది మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లున్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన మరో 16 మంది భారతీయులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.

Also Read :సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసరాలు

Next Story