రావణుడికి పదితలలు ఉన్నట్లుగానే.. కరోనాకు పదకొండు..
By తోట వంశీ కుమార్ Published on 14 April 2020 6:18 PM ISTరావణుడికి పది తలలు ఉన్నట్లుగానే .. కొవిడ్-19కి 11 రూపాలు ఉన్నాయంటా.. ఓ ప్రముఖ దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.. ఆకథనం మేరకు
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్నివణికిస్తోంది. ఈ మహమ్మారికి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా.. లక్షా పదివేల మందికి పైగా మృత్యువాత పడగా.. 20లక్షల పైగా కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి రూపాంతరం చెందుతుందా..? కొన్ని ఘటనలను చూస్తే నిజమేననిపిస్తోంది. ఇటీవల నోయిడాలో ఇద్దరు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. నిబంధనల ప్రకారం కోలుకున్నాక.. 24 గంటల్లో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించాలి. ఆ పరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారిని డిశ్చార్జీ చేశారు. డిశ్చారీ చేసేముందు వారిద్దరి నుంచి శాంపిల్ ను తీసుకుని పరీక్షలకు పంపారు. ఆ పరీక్షల్లో వారికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారిద్దరిని మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స నందిస్తున్నారు. ఇక కొందరిలో ఎటువంటి లక్షణాలు కనబడకున్నా.. వారికి కరోనా పాజిటివ్ అనే వస్తోంది. దీంతో ఈ మహమ్మారి రూపాంతరం చెందుతుందా అనే అనుమానం శాస్త్రవేత్తలకు వచ్చింది.
ఈ మహమ్మారి ప్రాంతాల వారిగా పరివర్తన చెందుతుందా..? రకరకాల రూపాలను సంతరించుకుంటుందా..? అంటే నిజమేనని ఎన్ఐవి (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) పరిశోధనలో వెల్లడైంది. రావణుడికి పది తలలు ఉన్నట్లుగానే .. కొవిడ్-19కి 11 రూపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారికి మందును కనిపెట్టే దిశగా ప్రపంచ వ్యాప్తంగా విసృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలుతున్న వైరస్‌కు, మన దేశంలో వ్యాప్తి చెందుతున్న వైరస్‌కు తేడా ఏంటీ అని పుణే కేంద్రంగా పరిశోధన చేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ వైరాలజి(ఎన్ఐవీ) పరిశోధకులు ఓ విషయాన్ని కనుగొన్నారు. వైరస్ సమూహం నుంచి 11 రకాల స్ట్రెయిన్స్ ను (వేర్వేరు రకాల వైరస్‌లను) వేరుచేశారు. ఇంత వరకు ఈ మహమ్మారి 11 రూపాలుగా మారుతున్నట్లు గుర్తించారు. దీంతో.. కరోనా వ్యాక్సిన్ కనుగొనడంతో కీలక ముందడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అత్యంత క్లిష్టమైన ప్రయోగం విజయవంతమైందని ఐసీఎంఆర్ ప్రకటించింది.