అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ని 108, 104 ఉద్యోగులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ని కలిసిన ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. 108, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. 108 టెక్నీషియన్‌కు రూ.30 వేలు, పైలెట్‌కు రూ.28 వేలు జీతం ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. 104 ఉద్యోగులకు రూ.28 వేలు, డ్రైవర్‌కు రూ.26 వేలు ఇస్తామని సీఎం తెలిపారని ఉద్యోగులు అన్నారు. 104 వైద్యులకు సర్వీస్‌ మెయిటేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.