రివర్స్ టెండరింగ్ తో రూ.1000 కోట్లు మిగులు - మంత్రి అనిల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 6:11 AM GMT
రివర్స్ టెండరింగ్ తో రూ.1000 కోట్లు మిగులు - మంత్రి అనిల్

అమరావతి: సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ విజయవంతం అయిందన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. రివర్స్‌ టెండరింగ్‌పై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడారు. టెండర్లలో ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టి చంద్రబాబు తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టరని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో రూ.61కోట్ల రూపాయాలు మిగిలియాని అనిల్‌ కుమార్‌ యాదవ్ పేర్కొన్నారు. సీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ పెట్టిన తర్వాత సుమారు రూ.1000 కోట్లు మిగిలింది. రాబోయే రోజుల్లో చేపట్టే రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ.500 కోట్లు మిగులుతాయన్నారు. మేము రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించకపోతే రూ.1500 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లేవి?. ఎక్సస్‌ టెండర్లు నిర్వహించడం ద్వారా చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆరోపణలు చేశారు.

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వందల కోట్ల ప్రజా ధనం మిగిలితే అభినందించాల్సిన ప్రతిపక్ష పార్టీ.. విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి అనిల్‌ కుమార్‌ అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అన్ని డిపార్ట్‌మెంట్లలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయాలు మిగులుతాయని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మిగిలిన ప్రజా ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తామన్నారు. దేవుడు కరుణించి జగన్‌ పాలనలో మంచి వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు. చంద్రబాబు ప్రజాధనాన్ని పది మంది కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే అదే ధనాన్ని పేదలకు ఖర్చు చేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే తప్పులేదు.. వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్తే తప్పా?, చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు. బీజేపీ నాయకులే చెబుతున్నారు చంద్రబాబుతో ఎందుకు జతకడతామని. కృష్ణా గోదావరి నదులకు వరదలు రావడం వలన ఇసుక లభ్యతకు కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. త్వరలో సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందని మంత్రి అనిల్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story