హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పీఎస్‌లో యువతి హల్‌చల్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2019 8:19 AM GMT
హైదరాబాద్‌  బంజారాహిల్స్‌ పీఎస్‌లో యువతి హల్‌చల్‌..!

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. మద్యం మత్తులో మహిళా కానిస్టేబుళ్లపై దాడికి దిగింది.

వివరాల్లోకి వెళ్తే.. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ యువతిని బంజారాహిల్స్‌ పోలీసులు కాపాడి స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో స్టేషన్‌లో యువతికి మెలుకువ రావడంతో వీరంగం సృష్టించింది.

శనివారం రాత్రి యువతి లీసా పూటుగా మద్యం సేవించి రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆమెను హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చేర్చారు. మెలుకువ రాగానే లీసా పోలీస్‌స్టేషన్‌ నుంచి పారిపోదామని ప్రయత్నించింది. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

కాగా మహిళా ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లపై యువతి లీసా దాడి చేసింది. ఆమెను గట్టిగా పట్టుకొని అదుపు చేసిన పోలీసులు.. ఆమె నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

లీసా నాగాలాండ్‌ నుంచి వచ్చిందని, మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. లీసాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.లీసా మద్యం మత్తులో ఉందా, లేకా డ్రగ్స్‌ తీసుకుందా అనే విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం లీసాను తల్లిదండ్రులకు అప్పగిస్తామని బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో యూపీ ఆర్మీ కెప్టెన్‌ అరెస్ట్

Next Story