రంగారెడ్డి జిల్లాలో ఆటో బోల్తా.. ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు
By అంజి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం వెల్‌జలా గ్రామంలో ఓ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటో ప్రయాణిస్తున్న ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులందరూ ఊర్కొండ మండలం జగబోయినిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఇవాళ హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్కూటీ ఢీకొని 14 నెలల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్‌కుమార్ తన మేనల్లుడిని ఏత్తుకొని జయభేరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతుండగా.. మాదాపూర్ వైపు వెళ్తున్న స్కూటీ రాజ్ కుమార్‌ను ఢీకొట్టింది. దీంతో రాజ్ కుమార్ చేతుల నుంచి చిన్నారి సతీష్ జారీ కిందపడ్డాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.