పాలు పోసి పెంచింది.. ప్రాణం మీదకు తెచ్చుకుంది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 6:29 AM GMT
పాలు పోసి పెంచింది.. ప్రాణం మీదకు తెచ్చుకుంది..!

ఇంట్లో పాములను పెంచుకుంటున్న ఓ మహిళ జీవితం పాముతోనే అంతం అయిపోయింది. తను ప్రేమగా పెంచుకున్న ఓ కొండచిలువ మెడకు చుట్టుకోవడంతో ఆమె దుర్మరణం పాలైంది. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఎంత పాలు పోసి పెంచినా పాము పామే.. జన్మతః వచ్చిన దాన్ని బుద్ధిని మార్చడం సాధ్యం కాదు. లారా హార్ట్ అనే మహిళ ఇండియానాలోని ఆక్స్‌ఫర్డ్ లో నివసిస్తోంది. ఈమెకి పాములంటే ఎంతో ఇష్టం. అందుకే ఇంట్లో ఏకంగా 140 పాములు పెంచుకుంటోంది.

వాటిలో ఒక కొండచిలువ కూడా ఉంది. అయితే లారా మరణించింది అంటూ ఆ ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారా శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడే అసలు విషయం బయటపడింది.

Laura Hurst Python Neck

ఆమె గొంతు నులిమినట్లుగా అనుమానాలు ఉండటంతో మరింత లోతుగా విచారణ చేయగా కొండచిలువ ఆమె మరణానికి కారణమని తేలింది. ఆమె మాత్రమే కాదు, ఆమెకు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తి కూడా స్నేక్ లవరే. అయితే ఆ ఇంటిలో అన్ని పాములు పెట్టుకోవడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Downloadfile

విష రహిత పాములైన కొండచిలువలు ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా అమెరికా దేశాల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఇవి మనిషిని కాటేసి చంపవు. మనిషిని ఊపిరాడకుండా చేస్తాయి.. తర్వాత తీరిగ్గా వాళ్ళని మింగేస్తాయి. అయినా పెంపుడు కొండచిలువలు తమ యజమానులని చంపటం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది అమెరికాలో ఒక వ్యక్తి, రష్యా లో సర్కస్ ట్రైనర్ కూడా ఇలాగే పెంపుడు కొండచిలువ చుట్టేసి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే మరణించారు.

Next Story