కాంటాజియన్ సినిమా చూడండి.. వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందో అర్థమవుతుంది..
By Newsmeter.Network Published on 28 March 2020 2:11 PM ISTకరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాసైతం ఈ వైరస్‌తో అతలాకుతలమవుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5.94 లక్షల మందిని ఈ వైరస్ సోకగా.. 27,250 మంది కరోనా వైరస్ భారిన పడి మృతి చెందారు. ఈ వైరస్ అత్యధికంగా సోకిన వారిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. భారత్‌లోనూ ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్‌లో ఈవైరస్ భారిన పడినవారి సంఖ్య 900కి చేరువులో ఉంది. ఇప్పటికే 20 మంది మృత్యువాత పడ్డారు.
Also Read :లాక్ డౌన్ ఎఫెక్ట్.. కండోమ్‌లకు యమ గిరాకీ!
ప్రంపచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడంతా ఈ కరోనా వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో తమిళ సినీనటి వరలక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఒక్కరూ 'కాంటాజియన్' సినిమా చూడాలని, ఈ సినిమాలో వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థమవుతుందని ఆమె తెలిపారు. 2011లో ఈ సినిమా వచ్చిందని, వైరస్ కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది అని ఆమె అన్నారు. ఈ సినిమా చూస్తే వైరస్ వ్యాప్తి గురించి అర్థమవుతుందని, ఈ సినిమా నిండా ఇప్పుడు మనం వింటున్న పదజాలమే ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సినిమా చూసైనా ప్రతీ ఒక్కరూ ఇంటికి ఎందుకు పరిమితం కావాలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఎందుకు పాటించాలో అర్థమవుతుందని అన్నారు.