ఆస్ట్రేలియా పర్యటనలో వైవీ సుబ్బారెడ్డి బిజీ.. బిజీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 1:17 PM GMT
ఆస్ట్రేలియా పర్యటనలో వైవీ సుబ్బారెడ్డి బిజీ.. బిజీ

ముఖ్యాంశాలు

  • వాణిజ్య వేత్తలు, ఇండియన్‌ డిప్యూటీ హై కమిషనర్‌తో వైవీ సుబ్బారెడ్డి భేటీ

సిడ్నీ: ఈనెల 2 నుంచి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

సోమ, మంగళవారాల్లో భారత డిప్యూటీ హై కమిషనర్‌ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు.

Yv Subbaredyy3

రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్‌ ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వైవీ వెల్లడించారు.

గత ప్రభుత్వం బడ్జెట్ లోని సింహ భాగం నిధులు కొద్దిమంది ప్రయోజనాల కోసం ఖర్చు పెడితే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజలు చెల్లించే పన్నులను తిరిగి సామాన్య ప్రజలకే చేర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

Yv Subbaredyy2

ఎన్‌ఆర్‌ఐలు వైవిధ్యమైన ప్రాజెక్టులతో ముందుకు రావాలని సుబ్బారెడ్డి అభిలషించారు. హెలిన్స్‌బర్గ్‌లోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియా పార్లమెంటును సందర్శించి అక్కడ ప్రజాప్రతినిధుల సభలు నిర్వహించే తీరును పరిశీలించారు. తొలుత ఆస్ట్రేలియా ఉపఖండంలోని తెలుగు ప్రజలు సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డికి ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో అక్కడి వైసీపీ నాయకులు చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, శేఖర్, విశ్వనాథ్, హర్ష, విజయ్, శ్రీధర్ పాల్గొన్నారు.

Next Story