ఆ క్రికెట‌ర్ ఎవ‌రో మీరే చెప్పండి.. బుర్ర గోక్కున్నా క్లారిటీ రావ‌ట్లే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Feb 2020 10:03 AM GMT
ఆ క్రికెట‌ర్ ఎవ‌రో మీరే చెప్పండి.. బుర్ర గోక్కున్నా క్లారిటీ రావ‌ట్లే..

టీమిండియా యువ ఆట‌గాడు యజ్వేంద్ర చహల్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. ఈ విష‌యం చహల్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్ర‌తి ఒక్క క్రీడాభిమానికి తెలుసు. ఎప్పుడు ఎదో ఇంట్రెస్టింగ్ కామెంట్‌తోనో.. ఫోటోతోనో ఆక‌ట్టుకునే చ‌హ‌ల్.. తాజాగా ఒక టిక్‌టాక్‌ వీడియోతో ద‌ర్శ‌న‌మిచ్చాడు.

శనివారం ఉదయం ప్రాక్టీస్ అనంత‌రం చ‌హ‌ల్ చేసిన‌ వీడియో.. ఇప్పుడు అభిమానులను త‌ల‌ప‌ట్టుకునేలా చేస్తుంది. చ‌హ‌ల్ వీడియోలో.. అత‌నితో పాటు.. ముగ్గురు క్రికెటర‍్లు ఉన్నారు. ముగ్గురు క్రికెట‌ర్లు ఎవ‌ర‌నేది తెలుస్తున్నా.. నాల్గో క్రికెటర్‌ ఎవరనేది ఫ్యాన్స్‌కు పరీక్ష‌గా మారింది.

ఇక‌, ఆ వీడియోలో చహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివం దూబేలు క్యాప్‌లు లేకుండా డ్యాన్స్‌ చేస్తుండ‌గా.. నాలుగో క్రికెటర్‌ మాత్రం క్యాప్‌ పెట్టుకుని ముఖం కనిపించకుండా డ్యాన్స్‌ చేశాడు. ఆ క్రికెటర్‌ ఎవరు అనేది రివీల్‌ చేయకపోవడంతో.. ఆ క్రికెట‌ర్ ఎవర‌ని క‌నుక్కునే ప‌నిలో అభిమానులు నిమ‌గ్న‌మ‌య్యారు. కొంత‌మంది రోహిత్‌ శర్మ అని.. మరికొంత‌మంది రిషభ్‌ పంత్ అని.. ఇంకొంత‌మంది కోహ్లీ, కుల్దీప్‌ యాదవ్ అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. బ‌హుశా.. దీనిపై చాహ‌ల్ స్పందించేదాక అభిమానుల‌ కామెంట్లు ఆగ‌వేమో మ‌రి.Next Story