న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త పేస‌ర్ మహ్మద్‌ షమీ తన కూతురు ఫోటో చూసి తెగ ఆనంద‌పడుతున్నాడు. త‌న ఆనందానికి కారణం ఏమై ఉంటుందా అని అనుకుంటున్నారా..? వివ‌రాళ్లోకెళితే.. షమీ కూతురు.. ఐరా షమీ ప‌సుపు రంగు చీరను ధరించి ఉన్న‌ ఫోటోను తన నాన్నకు వాట్సప్‌లో షేర్‌ చేసింది.

ఐరా చీరలో ఉన్న ఫోటోను చూసిన షమీ.. వెంటనే దానిని త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. చీరలో చాలా ముద్దుగా ఉన్నావు త‌ల్లి.. ఎంతో ఆనందంగా ఉంది.. నిన్ను చాలా మిస్సవుతున్నా.. త్వరలోనే నిన్ను కలుస్తానంటూ.. ఫోటో క్యాప్ష‌న్ జ‌త‌చేసి ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

ప్రసుత్తం షమీ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నాడు. కివీస్‌పై సిరీస్ గెలిచిన మూడో టీ20లో షమీ తన చివరి ఓవర్లో చివరి బంతికి రాస్‌ టేలర్‌ను బౌల్డ్‌ చేసి.. న్యూజిలాండ్‌ గెలవాల్సిన మ్యాచ్‌ను టైగా ముగించడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత మ్యాచ్‌ సూపర్ ఓవర్లో టీమిండియా గెలిచిన విష‌యం తెలిసిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.